
కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా.. నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, మే నెలాఖరులో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలోని తొలి పాట ‘చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి..’ ప్రోమోని రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు.
నిర్మాతల్లో ఒకరైన కిరణ్ ముప్పవరపు మాట్లాడుతూ– ‘‘చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి’ పాట మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కల్యాణ్, తమన్నా కాంబినేషన్, పి. సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, షరెత్ సంగీతం, బృందా మాస్టర్ సమకూర్చిన నృత్యాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్, ఎంటరై్టన్‌మెంట్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్ టోటల్ ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తారు’’ అని సమర్పకుడు మహేష్ కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి.