తన్‌..మన్‌.. మ్యూజిక్‌..

Music Director Thaman Special Story - Sakshi

సంగీత సాగరంలో పదేళ్లు క్లోజ్‌ ఫ్రెండ్స్‌.. క్రికెట్‌ గ్రౌండ్స్‌..   

సిటీలో పార్టీయింగ్‌ స్టైల్‌ ఇదే.. మ్యూజిక్‌ అయినా క్రికెట్‌ అయినా నైట్‌ టైమే..

10 ఇయర్స్‌ ఇండస్ట్రీ మ్యూజిక్‌ మాంత్రికుడు తమన్‌ చెప్పిన కబుర్లు

ఘంటసాల శ్రీనివాస్‌ సాయి తమన్‌ శివకుమార్‌ అనే పూర్తి పేరు వింటే కొంచెం కన్‌ఫ్యూజ్‌ అయ్యే వారుంటారేమో కానీ... సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తమన్‌. ఎస్‌ఎస్‌ అనేపొట్టి ఇంటిపేరును సూపర్‌ సక్సెస్‌ అనే గట్టి నిక్‌నేమ్‌గా మార్చుకుని చిరకాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకున్న  యువ సంగీత దర్శకుడు తమన్‌.. ఈ యంగ్‌ మ్యూజిక్‌ సునామీ సినీ సంగీత ప్రస్థానంలో 10 వసంతాలతో పాటు 100 చిత్రాల మైలురాయిని కూడా దాటాడు. తాజాగా విడుదలైన మజిలీ సినిమాకు మంచి సంగీతాన్ని అందించి ప్రశంసలు అందుకుంటున్న తమన్‌తో సాక్షి ముచ్చటించింది. ఆయన పంచుకున్న టెన్‌ ఇయర్స్‌ జర్నీ విశేషాలు ఆయన మాటల్లోనే...

సాక్షి, సిటీబ్యూరో : తొమ్మిదేళ్ల వయసులో డ్రమ్మర్‌గా ప్రారంభమైన నా సంగీత ప్రయాణం.. సినిమా రంగానికి వచ్చిన పదేళ్లలో ఎన్నో అనుభవాలు. ఎన్నెన్నో పురస్కారాలు, ప్రశంసలతో సక్సెస్‌ ఫుల్‌గా సాగుతోంది. నా ఈ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూనే... మరిన్ని కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నా.. ఇప్పటిదాకా టచ్‌ మీ నాట్‌ తరహాలో ఉంటూ వచ్చానని అంటుంటారు అందరూ.. అయితే ఇకపై ప్రత్యక్షంగా ప్రజలకు చేరువవుదామనే ఆలోచనలో భాగంగానే... స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న సూపర్‌ సింగర్స్‌లో కనిపించడం... అలాగే లైవ్‌ కన్సర్ట్స్‌తో కూడా ఇకపై ప్రేక్షకులకు కనిపిస్తా.. వినిపిస్తా..
 
నైట్‌ ఈజ్‌ బ్రైట్‌
నైట్‌ టైమ్‌ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. రాత్రి 7–8 గంటల నుంచి ఎవరూ పెద్దగా ఫోన్లు చేయరు ఎంతో ఇంపార్టెంట్‌ అయితే తప్ప ఫోన్‌ అటెండ్‌ అవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే నైట్‌ 8గంటల నుంచి ఉదయం 4గంటల వరకు నా మ్యూజిక్‌ కంపోజింగ్‌ వర్క్‌ ప్లాన్‌ చేసుకుంటాను. ఈ విషయంలో రెహ్మాన్‌ పంథాయే నాది కూడా.. సినీ రంగంలో గొప్ప గొప్ప సంగీత దర్శకులైన ఎం.ఎం.కీరవాణి, మణిశర్మ, రాజ్‌కోటి... ఇలా దాదాపు అందరి దగ్గరా శిష్యరికం చేసిన అనుభవం నాకు ఈ రంగంలో రాణించడానికి బాగా ఉపయోగపడింది.  
 
న్యూ టాలెంట్‌కు ఆకాశమే హద్దు
నేపథ్య సంగీత దర్శకుడిగా మాత్రమే తెలిసిన నన్ను నేను నేరుగా ప్రేక్షకులకు పరిచయం చేసుకోవాలనుకున్నాను. పైగా డైట్‌ వర్కవుట్‌ చేసి ఇప్పుడు కొంచెం స్లిమ్‌గా కూడా మారాను కదా..(నవ్వుతూ). రాత్రి 9 గంటల సమయంలో ప్రసారమయ్యే స్టార్‌ మా మ్యూజికల్‌ రియాల్టీ షో సూపర్‌సింగర్‌లో హరితేజ, రేవంత్‌తో కలిసి న్యాయనిర్ణేతగా చేస్తుంటే తెలుస్తోంది... ప్రస్తుతం టాలెంట్‌కు ఆకాశమే హద్దుగా ఉందని.. పాటల పట్ల తమ అభిరుచిని మరచిపోయిన అమెచ్యూర్‌ గాయనీ గాయకుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయడం అనే కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. అంతేకాదు... ఔత్సాహిక గాయనీ గాయకులు ఇంత మందితో సంభాషించే అవకాశం కొత్త విషయాలను నాకు నేర్పిస్తోంది. చాలాసార్లు అనుకున్నా ఐదారుగురు తప్ప నాకు కొత్త గాయనీ గాయకులను పరిచయం చేసే అవకాశం లభించలేదు. ఇలాంటి షోలు నాకు ఆ అవకాశాన్ని ఇస్తాయని ఆశిస్తున్నా..  

బాల్యాన్ని బాధించొద్దు...
చిన్నప్పుడు 15ఏళ్ల వయసులో తమిళ్‌లో బాలుగారి ప్రోగ్రామ్‌కి ఆర్కెస్ట్రాలో డ్రమ్స్‌తో పార్టిసిపేట్‌ చేశాను. ఆ తర్వాత బిగ్‌బాస్‌ కోసం థీమ్‌సాంగ్‌తో పాటు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన మంచి అనుభవం కూడా స్టార్‌ మా సూపర్‌ సింగర్స్‌ షో ఒప్పుకోవడానికి కారణం. ఇంకో విషయం చెప్పాలి... మా టైమ్‌లో ఇన్ని కాంటెస్ట్‌లు లేవు. ఇప్పుడు పిల్లలు సీరియస్‌ పోటీల్లో పాల్గొనడం చూస్తుంటే మాత్రం కొంచెం బాధనిపిస్తోంది.. బాల్యాన్ని  ఎంజాయ్‌ చేయనీయకుండా చిన్నప్ప్పుడే గ్లామర్, ఎక్స్‌పోజర్‌ మీద క్రేజ్‌ పెంచేస్తే వాళ్లు చాలా మిస్‌ అవుతారు కదా? చిన్నతనంలో ఆడుకోవాలి, చదువుకోవాలి. అందుకే పిల్లల పోటీలను జడ్జ్‌ చేయాలంటే ఇష్టపడను. అయితే ఇప్పుడు నేను జడ్జ్‌ చేస్తున్న కాంటెస్ట్‌లో పోటీదారులంతా తగిన వయసున్నవాళ్లే. మెచ్యూర్డ్‌ పీపుల్‌.  

‘స్నేహ’సంగీతం...
తమన్‌ తన స్నేహితులైన ప్లేబ్యాక్‌ సింగర్స్‌ రంజిత్, రాహుల్‌ నంబియార్, నవీన్, మాధవ్‌... తదితరులతో కలిసి తక్కలి పేరిట బ్యాండ్‌ కూడా ఏర్పాటు చేశారు. తక్కలి అంటే టమాటో అని అర్థం. చెన్నైలో ఉండే ఈ ఫ్రెండ్స్‌ అంతా మ్యూజిక్‌ అభిరుచితో పాటు ఫుడీస్‌ కూడా కావడంతో ఎన్నో వంటకాల్లో వినియోగించే టమోటా పేరు పెట్టారు. విభిన్న రకాల సామాజిక అంశాలపై పాటలతో ఈ బ్యాండ్‌ ద్వారా ఒక ఆల్బమ్‌ కూడా లాంచ్‌ చేశారు. ఎవరికి ఏ పాట నచ్చుతుంది? ఏ ట్యూన్స్‌కి ఎలా రియాక్టవుతారు అనేది లైవ్‌ బ్యాండ్‌ ద్వారా నేరుగా తెలుస్తుంది. నా సొంత బ్యాండ్‌ ‘తక్కలి’ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్ధేశ్యం అదే అని చెప్పారు తమన్‌.  

నో పబ్స్‌... క్రికెట్‌ లబ్‌డబ్‌
ప్రస్తుతం తెలుగులో వెంకిమామ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టŠస్‌ చేస్తున్నాను. చెన్నైలో ఉంటున్నప్పటికీ.. గత కొంత కాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువ వర్క్స్‌ చేస్తున్నాను. దాంతో ఇక్కడ మంచి ఫ్రెండ్స్‌ ఏర్పడ్డారు. వీకెండ్‌లో సూపర్‌సింగర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాను. సిటీలో పార్టీయింగ్, పబ్‌లకు వెళ్లడం అలవాటు లేదు. ఈ సిటీ íశివార్లలో మంచి స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌ ఉన్నాయి. సింగర్స్, మ్యూజిషియన్లు.. ఇలా చాలా మంది మా ఫ్రెండ్స్‌ టీమ్‌లో ఉన్నవాళ్లమంతా కలిసి శంషాబాద్‌లోని గ్రౌండ్‌తో పాటు సిటీ దగ్గర్లోని కొన్ని గ్రౌండ్స్‌లో నైట్‌ క్రికెట్‌ ఆడతాం. హైదరాబాద్‌ వస్తే ఈ ఫన్‌ని మిస్సవడానికి అసలు ఇష్టపడను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top