ముంబైలో మహిళల అంతర్జాతీయ సినిమా ఉత్సవం | Mumbai Women's International Film Festival to start Oct 8 | Sakshi
Sakshi News home page

ముంబైలో మహిళల అంతర్జాతీయ సినిమా ఉత్సవం

Sep 14 2013 6:04 PM | Updated on Sep 1 2017 10:43 PM

ముంబైలో మొట్టమొదటిసారిగా మహిళల అంతర్జాతీయ సినిమా ఉత్సవాన్ని (ఎండబ్ల్యుఐఎఫ్ఎఫ్) అక్టోబర్ 8 నుంచి నిర్వహిస్తున్నారు.

సినీ పరిశ్రమలో మహిళా దర్శకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ముంబైలో మొట్టమొదటిసారిగా మహిళల అంతర్జాతీయ సినిమా ఉత్సవాన్ని (ఎండబ్ల్యుఐఎఫ్ఎఫ్) అక్టోబర్ 8 నుంచి నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ సదుద్దేశాన్ని ప్రోత్సహించారు. మహిళా దర్శకులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

నందితాదాస్, జోయా అఖ్తర్, రీమా కగ్తి, ఫరా ఖాన్, హనీ ఇరానీ, రేణుకా సహానీ, సుమిత్రా భావే లాంటి అగ్రస్థాయి దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు లేదా వారి సినిమాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు. 8వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సుమారు 70 దేశాలకు చెందిన దాదాపు 150 సినిమాలను ఆరు వేదికలపై ప్రదర్శిస్తారు. పలువురు ప్రముఖులు పాల్గొనే వర్క్షాప్లు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఆక్యులస్ క్రియేషన్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement