breaking news
women filmmakers
-
ఇఫీలో ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్ హవా
సినిమా రంగంలో మహిళలంటే... వెండితెరపై కనిపించే కథానాయికలే గుర్తొస్తారు... అలాగే క్యారెక్టర్, కామెడీ, విలన్... వంటి పాత్రల్లోనూ మహిళలు నటించడం సహజం. అయితే తెరపై కనిపించేవారితో పోలిస్తే తెరవెనక నిర్మాతలుగా, సాంకేతిక విభాగాల్లో పని చేసే మహిళలు చాలా తక్కువమంది ఉంటారు.కానీ ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. అందుకు ఓ తాజా ఉదాహరణ గోవా వేదికగా జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ). ఈ ఏడాది ఈ ఉత్సవంలో 52 మంది మహిళా ఫిల్మ్ మేకర్స్ పాల్గొంటున్నారు. వారిలో భారతీయ చిత్రనిర్మాతలు కూడా ఉన్నారు. భారతీయ ఫిల్మ్ మేకర్స్‌లో లీనా యాదవ్ దర్శకత్వం వహించిన ‘బికమింగ్’ అనే డాక్యుమెంటరీ, ముస్కాన్ అస్థానా దర్శకత్వంలో రూపొందిన ‘సేవ్ మిచ్చర్’, అనుపమ సారథి దర్శకత్వం వహించిన ‘పిలి చన్నె’, నటి అంతరా జీజీ చౌదరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సూర్యముఖి’ ‘ఇఫీ’లో ప్రదర్శనకు అర్హత సాధించడం గొప్ప విషయం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ్ర పాధాన్యం ఇస్తూ, ఈ లేడీ డైరెక్టర్స్ ఈ చిత్రాలను రూపొందించారు. ఇక వేరే దేశాలకు చెందిన ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్‌లో కిర్గిజ్ చిత్రదర్శక–నిర్మాత నర్ఘిజా డోటియేవా ‘స్కైలార్క్’, రొమేనియన్ చిత్రదర్శక–నిర్మాత అలీనా షెర్బాన్ల ‘ఐ మ్యాటర్’ వంటి చిత్రాలు కూడా స్క్రీనింగ్ జాబితాలో ఉన్నాయి. ‘‘మూస పద్ధతులను సవాల్ చేయడం, సంస్కృతి, మహిళల అనుభవాలను అన్వేషించడం... వంటి అంశాలను ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్ తెరపైకి తీసుకురావడం గొప్ప విషయం’’ అని భారతీయ మూలాలున్న అలీనా షెర్బాన్ పేర్కొన్నారు. ఈ నెల 20న ఆరంభమైన ‘ఇఫీ’ వేడుకలు 28 వరకు జరుగుతాయి. -
ముంబైలో మహిళల అంతర్జాతీయ సినిమా ఉత్సవం
సినీ పరిశ్రమలో మహిళా దర్శకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ముంబైలో మొట్టమొదటిసారిగా మహిళల అంతర్జాతీయ సినిమా ఉత్సవాన్ని (ఎండబ్ల్యుఐఎఫ్ఎఫ్) అక్టోబర్ 8 నుంచి నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ సదుద్దేశాన్ని ప్రోత్సహించారు. మహిళా దర్శకులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసలు కురిపించారు. నందితాదాస్, జోయా అఖ్తర్, రీమా కగ్తి, ఫరా ఖాన్, హనీ ఇరానీ, రేణుకా సహానీ, సుమిత్రా భావే లాంటి అగ్రస్థాయి దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు లేదా వారి సినిమాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు. 8వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సుమారు 70 దేశాలకు చెందిన దాదాపు 150 సినిమాలను ఆరు వేదికలపై ప్రదర్శిస్తారు. పలువురు ప్రముఖులు పాల్గొనే వర్క్‌షాప్‌లు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఆక్యులస్ క్రియేషన్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.


