గల్ఫ్‌ వెతలు | movie on Gulf problems | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ వెతలు

Jun 13 2017 11:54 PM | Updated on Aug 21 2018 3:08 PM

గల్ఫ్‌ వెతలు - Sakshi

గల్ఫ్‌ వెతలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ రాని గల్ఫ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్‌’. చేతన్‌ మద్దినేని, డింపుల్, సంతోష్‌ పవన్,

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ రాని గల్ఫ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్‌’. చేతన్‌ మద్దినేని, డింపుల్, సంతోష్‌ పవన్, అనిల్‌ కళ్యాణ్, సూర్య, నల్ల వేణు ప్రధాన పాత్రధారులు.  పి. సునీల్‌ కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్‌. రామ్‌కుమార్‌ నిర్మించారు. జూలై మొదటివారంలో పాటల్ని, రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గల్ఫ్‌ దేశాలన్నీ పర్యటించి, దాదాపు 400కి పైగా కేస్‌ స్టడీలు తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది.

చిన్నారాయణ రాసిన చక్కటి భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘సరిహద్దులు దాటిన ప్రేమ కథ అనే ఉప శీర్షికతో వస్తోన్న చిత్రమిది. ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’, ‘క్రిమినల్‌ ప్రేమ కథ’ల కన్నా పెద్ద కమర్షియల్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు నిర్మాత. ‘‘గల్ఫ్‌ నేపథ్యంలో తెలుగులో ఇప్పటికీ ఒక్క సినిమా రాకపోవడం ఆశ్చర్యం. సునీల్‌ కుమార్‌రెడ్డి ఆ లోటు తీర్చేసారు. ఆయనలోని జర్నలిస్ట్‌ ఈ సినిమా తీయడానికి ఉసిగొల్పినట్టు అనిపిస్తోంది’’ అని మాటల రచయిత పులగం చిన్నారాయణ అన్నారు. సంగీత దర్శకుడు ప్రవీణ్‌ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత బి. బాపిరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement