పెళ్లి కుదిరింది... | Meera Jasmine Marriage to Anil John On 12 February 2014 | Sakshi
Sakshi News home page

పెళ్లి కుదిరింది...

Dec 30 2013 11:52 PM | Updated on Sep 2 2017 2:07 AM

మీరా జాస్మిన్

మీరా జాస్మిన్

ఇది కథానాయికల పెళ్లి సీజన్‌లా ఉంది. మొన్నేమో వీణామాలిక్, నిన్నేమో సమీరారెడ్డి పెళ్లి వార్తలు తెలిశాయి. లేటెస్ట్‌గా ఈ జాబితాలో మీరా జాస్మిన్ చేరారు.

ఇది కథానాయికల పెళ్లి సీజన్‌లా ఉంది. మొన్నేమో వీణామాలిక్, నిన్నేమో సమీరారెడ్డి పెళ్లి వార్తలు తెలిశాయి. లేటెస్ట్‌గా ఈ జాబితాలో మీరా జాస్మిన్  చేరారు. ఆమెకు పెళ్లి కుదిరింది. కేరళకు చెందిన మీరా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా పాపులార్టీ సంపాదించుకున్నారు. తెలుగులో ఆమె భద్ర, గుడుంబా శంకర్, మహారథి, అఆఇఈ తదితర చిత్రాల్లో నటించారు. ‘మాండలిన్’ రాజేష్‌తో మీరా ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు అప్పట్లో బాగా షికారు చేశాయి. అయితే... అలాంటిదేమీ లేదని మీరా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇటీవలే మీరాకు దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనిల్ జానీ టైటస్‌తో పెళ్లి ఖరారయ్యింది. ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఈ పెళ్లి కుదిరిందని సమాచారం. ఫిబ్రవరి 12న కేరళలోని పాలయమ్‌లో గల ఓ చర్చిలో వీరి పెళ్లి జరగనుంది. అనంతరం ఎడపళంజి ఆడిటోరియంలో రిసె ప్షన్ జరగనుంది. ప్రస్తుతం మీరా మలయాళంలో ‘ఒన్నుమ్ మిండాదే’ సినిమా చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement