లోపల జరిగేవన్నీ నిజం కాదు

Mahesh Vitta Special Interview in Sakshi

హీరో నాని వల్లే ‘బిగ్‌బాస్‌’ చాన్స్‌  

హౌస్‌లో మెంటల్‌ టెన్షన్‌ ఎక్కువ

‘సాక్షి’తో మహేష్‌ విట్టా

తెలుగు రాష్ట్రాల్లో టీవీ ప్రేక్షకులకు మంచి కిక్‌ ఇచ్చే షోల్లోఒకటి ‘బిగ్‌బాస్‌’. ఇందులో పాల్గొనే అవకాశం ఎన్నో వడపోతల తర్వాత వస్తుంది. అలాంటిది ‘ఫన్‌బకెట్‌’ కామెడీ స్కిట్లతో సోషల్‌ మీడియా ద్వారా యూత్‌కు చేరువైన మహేష్‌ విట్టా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బిగ్‌బాస్‌–3 హౌస్‌లో ఏకంగా 84 రోజులు ఉన్నాడు. గతవారం ఎలిమినేట్‌ అయ్యాక ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. లోపల జరిగేవన్నీ నిజం కాదని, నాగార్జున ఓన్లీ స్క్రిప్ట్‌ని మాత్రమే ఫాలో అవుతారని..ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.ఆవి మహేష్‌ మాటల్లోనే..

సాక్షి,సిటీబ్యూరో: వాస్తవానికి నేను ‘బిగ్‌బాస్‌–2’కి వెళ్లాల్సిన వాడిని. అప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్‌ చివర్లో ఉన్నాను. అదే సమయంలో ‘బిగ్‌బాస్‌’లోకి మహేష్‌ విట్టా వస్తే బాగుంటుందని ‘స్టార్‌ మా’కి నాని అన్న చెప్పారు. అప్పుడు ‘మా’ యాజమాన్యం నన్ను సంప్రదించింది. షూటింగ్స్‌లో బిజీ ఉండి రాలేనని.. వచ్చే ఏడాది వస్తాననడంతో సీజన్‌–3కి రావాలని పిలిచారు. తెలిసిన డైరెక్టర్లు, స్నేహితుల సలహాలు తీసుకుని అంతా ఓకే అనుకున్నాక ఓకే చెప్పా. అలా నాని మాట సాయం వల్ల వెళ్లానే తప్ప విజేత అవ్వాలని మాత్రం కాదు. నన్ను నేను టీవీలో చూసుకోవడానికి, ప్రేక్షకులకు ‘వాట్‌ ఈజ్‌ మహేష్‌ విట్టా’ అని చెప్పడం కోసం వెళ్లా. 

తల్లి రమణమ్మతో మహేష్‌ విట్టా
నెగిటివ్‌ చెప్పడం చాలా కష్టం 
హౌస్‌లోకి అడుగుపెట్టాక చాలా సంతోషమనిపించింది. అందరం కొత్త ముఖాలే అయినా కలిసిపోయాం. కబుర్లు చెప్పుకుంటూ బాగానే ఉంటున్న సమయంలో టాస్క్‌లు ఇస్తారు. ఏవో చిన్న చిన్న గొడవలు. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారు. ఓ వ్యక్తి గురించి నెగిటివ్‌గా చెప్పాలి అంటే ఎలా చెప్తాం? అంత తప్పు ఆ వ్యక్తి ఏం చేశాడని చెప్పాలి? సరే.. బిగ్‌బాస్‌ చెప్పాడు కదా అని చెప్తాం.. మళ్లీ పొద్దున లేచాక ఆ మనిషి ముఖం చూడాల్సిందేగా? ఇన్ని సమస్యలు ఉండబట్టే లోపల ప్రతి ఒక్కరికీ చాలా మెంటల్‌ టెన్షన్‌ ఉంటుంది. బయటకు చెప్పుకోలేం. మీరు చూస్తున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరు.  

ఫుడ్‌ విషయంలో ఇబ్బంది పడ్డా..
హౌస్‌లో ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడాలి. ఒక మనిషిని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. వాళ్లకు నచ్చిన కూరగాయాల్ని పంపుతారు. ఆ కూరగాయలు కూడా ఫ్రెష్‌ ఉండవు. వారానికి సరిపడా పంపే రేషన్‌లో కొన్ని ముఖ్యమైన నిత్యావసర సరుకులు ఉండవు. ఒకసారి కూరలో వేసుకునే కారం పంపలేదు. దాంతో మాదగ్గరున్న ఎండు మిర్చిని దంచి కారంలా చేసి కూరల్లో వాడుకున్నాం. లోపల పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

లైట్స్‌ ఆపితేనే పడుకోవాలి
లోపల ఉన్న మాకు రాత్రి– పగలు ఎప్పుడో తెలియదు. బిగ్‌బాస్‌ లైట్లు ఆపి పడుకోండి అంటే పడుకోవాలి, లైట్లు ఆన్‌చేసి లేవమంటే లేవాల్సిందే. నైట్‌ టైం పోలీసుల పెట్రోలింగ్‌ వాహనాల సైరన్‌ విని రాత్రి అయ్యిందేమో అనుకునేవాళ్లం. ఇంటి నుంచి లెటర్స్‌ వస్తే వారు చదివి, బయట విషయాలు లేవంటేనే మాకు సమచారం ఇస్తారు. 

నాగార్జునకు కూడా తెలియదు
వాస్తవానికి హౌస్‌లో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు నాగార్జున గారికి కూడా తెలియనివ్వరు. వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ని మాత్రం ఆయన ఫాలో అవుతారు. ఆయన కూడా ఎవ్వరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదు, ఇబ్బంది పెట్టేవారు అసలే కాదు. అసలు నేను ఎందుకు పనికిరానని అందరూ అనుకున్న సమయంలో నాగ్‌ సార్‌ ‘మహేష్‌ నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్, నీ స్టైల్లో నువ్వు ఆడు’ అంటూ సపోర్ట్‌ చేశారు. దసరా రోజు హౌస్‌లోకి వచ్చినప్పుడు నాతో సరదాగా ఉన్నారు. ఆ హ్యాపీ మూమెంట్‌ స్వీట్‌ మెమరీ. నాకు బాగా నచ్చిన వ్యక్తి బాబా మాస్టర్‌. ఓట్ల ప్రకారంగా రాహుల్‌ విన్నర్‌. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు. ఆ రాజకీయాలు ఏంటనేవి నేను చెప్పను. హౌస్‌ నుంచి రాగానే అమ్మని కలిశాను. కొన్నిరోజులు కేరళ వెళతా.   టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం గత వారంలో అయిన గొడవను టీవీలో ఫ్రెష్‌గా చూపిస్తారు. పునర్నవి, రాహుల్, నేను, వితిక, వరుణ్‌ ఫ్రెండ్స్‌. మా మధ్య సరదా సంఘటనలు జరిగాయి. వీటిని ఎడిటింగ్‌ చేసి పునర్నవి, రాహుల్‌ మధ్య ఏదో ఉందన్నట్టు టెలికాస్ట్‌ చేశారు.  అక్కడ అదేం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వార్తలు

17-11-2019
Nov 17, 2019, 11:00 IST
బిగ్‌బాస్‌ తెలుగు 3..  అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతగానో క్రేజ్‌ తెచ్చిపెట్టింది. చాలామందికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక రాహుల్‌ చేజారిన...
14-11-2019
Nov 14, 2019, 18:41 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 గ్రాండ్‌ ఫినాలే టీఆర్పీలో గత రెండు సీజన్‌ల ‍రేటింగ్‌ రికార్డును తిరగరాసింది.
12-11-2019
Nov 12, 2019, 19:01 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 టైటిల్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లీగంజ్‌ పాడాల్సిన రాములో రాములా..పాట అనురాగ్‌ కులకర్ణికి దక్కింది.
11-11-2019
Nov 11, 2019, 11:14 IST
హేమ, హిమజ చేసిన నెగెటివ్‌ కామెంట్లను పట్టించుకోకండి..
10-11-2019
Nov 10, 2019, 10:52 IST
ఆమె రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నా.. తను వెళ్లాలనుకున్న చోటుకు వెళ్లి కోరిక నెరవేర్చుకుంది. 
09-11-2019
Nov 09, 2019, 20:07 IST
సాక్షి, సిటీబ్యూరో : అశేష ప్రేక్షకాదరణ పొందిన బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 విన్నర్‌గా నిలిచిన గాయకుడు రాహుల్‌...
08-11-2019
Nov 08, 2019, 10:47 IST
జాఫర్‌ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జాఫర్‌ ప్రవర్తిస్తున్నాడని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
07-11-2019
Nov 07, 2019, 08:42 IST
రాహుల్‌ సిప్లిగంజ్‌.. మొన్నటి దాకా సినీ నేపథ్య గాయకుడు. మరి నేడు.. బిగ్‌బాస్‌–3 విజేత.అత్యంత సాధారణ యువకుడిగా ఎలాంటి అంచనాలు...
06-11-2019
Nov 06, 2019, 16:59 IST
రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఇప్పుడు ఈ పేరు ప్రతీగల్లీలో మారుమోగుతోంది. బిగ్‌బాస్‌ తెలుగు 3 విజేతగా తన పేరు లిఖించుకున్న రాహుల్‌ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా...
06-11-2019
Nov 06, 2019, 15:42 IST
బాబా భాస్కర్‌.. తెలిసిన కొద్దిమందికీ కోపిష్టి కొరియోగ్రాఫర్‌గా పరిచయం. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ కా కింగ్‌. ఆయన మాటలకు నవ్వుకోని...
06-11-2019
Nov 06, 2019, 15:06 IST
బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ మొత్తమే దక్కిందని తెలుస్తోంది.
06-11-2019
Nov 06, 2019, 11:15 IST
ప్రముఖ యాంకర్‌ ఝాన్సీ సోషల్‌ మీడియా వేదికగా బిగ్‌బాస్‌ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
05-11-2019
Nov 05, 2019, 17:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-పునర్నవిల రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ...
05-11-2019
Nov 05, 2019, 14:42 IST
అతిరథ మహారథుల సమక్షంలో బిగ్‌బాస్‌ 3 తెలుగు షో విజేతను ప్రకటించారు. 105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌...
05-11-2019
Nov 05, 2019, 12:09 IST
శ్రీముఖి వేసుకున్న పచ్చబొట్టే  ఆమె ఓటమికి నాంది పలికిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
05-11-2019
Nov 05, 2019, 10:25 IST
‘విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది’ అని ఆమె బిగ్‌బాస్‌ వేదికపై చెప్పుకొచ్చింది. అంటే రాహుల్ ఏం చేయకపోయినా కేవలం అదృష్టం వల్లే గెలిచాడు...
04-11-2019
Nov 04, 2019, 20:28 IST
ఆద‍్యంతం ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి నిన్నటి (ఆదివారం)తో శుభంకార్డు పడింది. 105 రోజుల ప్రయాణానికి తెరదించుతూ...
04-11-2019
Nov 04, 2019, 12:44 IST
ఏ ప్రాతిపదికన రాహుల్‌ సిప్లిగంజ్‌ను విజేతగా ప్రకటించారో చెప్పాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
04-11-2019
Nov 04, 2019, 10:38 IST
పున్నూ ఫ్యాన్స్‌ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్‌ చేసిన ప్రతీసారి అతని బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
04-11-2019
Nov 04, 2019, 08:54 IST
మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్‌ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top