సూపర్‌ ఆఫీసర్‌ | mahesh babu new movie sarileru neekevvaru photo leak | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఆఫీసర్‌

Jul 10 2019 12:25 AM | Updated on Jul 10 2019 12:25 AM

mahesh babu new movie sarileru neekevvaru photo leak - Sakshi

సెట్లో మహేశ్‌

ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ షూటింగ్‌ లొకేషన్‌లోని ఫొటోలు బయటకు రాకుండా చిత్రబృందం ఆపలేకపోతోంది. అధికారికంగా విడుదల చేయకముందే హీరోల లుక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం ఆయా చిత్రబృందాలను కలవరపెడుతోంది. తాజాగా మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’కి సంబంధించిన ఓ ఫొటో బయటికొచ్చింది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు మహేశ్‌బాబు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంది. అక్కడి లొకేషన్‌లోంచి బయటకు వచ్చిన ఫొటోను చూసి మహేశ్‌ ఫ్యాన్స్‌ సూపర్‌ ఆఫీసర్‌ అని సంబరపడుతున్నారు. ఈ కశ్మీర్‌ షెడ్యూల్‌ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు టీమ్‌. విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement