కి.. పోయి కృ.. వచ్చె | Sakshi
Sakshi News home page

కి.. పోయి కృ.. వచ్చె

Published Sat, Jun 16 2018 12:40 AM

Kriti Kharbanda confirms signing Housefull 4 - Sakshi

ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు హీరోయిన్‌ కృతీ కర్భందా. హౌస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో రానున్న ఫోర్త్‌ పార్ట్‌ ‘హౌస్‌పుల్‌ 4’లో ఆమె ఒక కథానాయికగా నటించనుండటమే ఇందుకు కారణం. ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ హౌస్‌ఫుల్స్‌కు దర్శకత్వం వహించిన సాజిద్‌ ఖాన్‌నే ‘హౌస్‌ఫుల్‌ 4’ను డైరెక్ట్‌ చేయనున్నారు. థర్డ్‌ పార్ట్‌కు సాజిద్‌ సామ్జీ అండ్‌ ఫర్హాద్‌ సామ్జీ కలిసి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, చుంకీ పాండే ముఖ్య తారలుగా నటించనున్న ‘హౌస్‌ఫుల్‌ 4’ టీమ్‌లోకి తాజాగా కృతీ కర్భందా ఎంపికయ్యారు.

అక్షయ్‌కుమార్‌ సరసన ఈమె కనిపించనున్నారట. ‘‘బాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కామెడీ ఫ్రాంచైజీస్‌లో హౌస్‌ఫుల్‌ ఒకటి. ఇంతమంది స్టార్స్‌ ఉన్న సినిమాలో నేనింత వరకు నటించలేదు. అలాగే ఇలాంటి డిఫరెంట్‌ స్టోరీ కూడా నేను వినలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు కృతీ. నిజానికి కియారా అద్వానీని అనుకున్న ప్లేస్‌లో ఫైనల్‌గా కృతీ భాగమయ్యారని బీటౌన్‌ టాక్‌. కి పోయి కృ వచ్చె అన్నమాట. ఇదివరకు ‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ నెక్ట్స్‌ ‘తీన్మార్, బ్రూస్‌ లీ’ లాంటి సినిమాలతో తెలుగు తెరపై మెరిశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement