
లాక్‌డౌన్ వేళ పాకశాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించినందుకు తెగ సంబరపడిపోతున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. లాక్‌డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు కియారా సమాధానం చెబుతూ – ‘‘నాకు ఇంట్లో కుటుంబసభ్యులతో ఉండటం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ లాక్‌డౌన్ నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదు. కానీ షూటింగ్స్‌ను బాగా మిస్ అవుతున్నాననిపిస్తోంది. ఇప్పుడు నా డైలీ లైఫ్ ఉందంటే... వర్కవుట్స్ మిస్ కావడంలేదు. లూడో వంటి ఇండోర్ గేమ్స్ ఆడుతున్నాను.
నా స్కూల్ టైమ్ వీడియోలు చూస్తున్నాను. ఇటీవలే మా స్కూల్ టీచర్స్‌తో కూడా మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది నా వంటల గురించి. నాకు ఇంటి వంట అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కేక్, బిస్కెట్లు, హల్వా చేసేదాన్ని. ఇప్పుడు వేరే వంటకాలు కూడా నేర్చుకుంటున్నాను. కొన్ని వంటకాలను ఆన్‌లైన్ రెసిపీలను ఫాలో అవుతూ చేశాను. ఇప్పుడు ఎవరైనా ఏ భారతీయ వంటకం పేరు చెప్పినా నేను చేయగలను’’ అని పేర్కొన్నారు.