మిస్టర్‌ ఖైదీ

Karthi's Next Titled Khaidi - Sakshi

తమిళ నటుడు కార్తీ మంచి ఊపు మీద ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో జోరు పెంచారు. రెమో ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్న ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో స్టార్ట్‌ కానుంది. అలాగే ‘మా నగరం’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోనూ కార్తీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఖైదీ’ అనే టైటిల్‌ పెట్టారని కోలీవుడ్‌ టాక్‌. మరి.. కార్తీ ఖైదీగా ఎందుకు మారారు? అనే విషయాన్ని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... టాలీవుడ్‌లోచిరంజీవికి ‘ఖైదీ’ చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు కార్తీ కెరీర్‌కు ఈ టైటిల్‌ ఎంతవరకు హెల్ప్‌ అవుతుందో మరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top