‘అలాగైతే నా బిడ్డను సముద్రంలో తోసేస్తా’

Kangana Ranaut Sensational Comments On Nepotism   - Sakshi

ముంబై : తన అభిప్రాయాలను బోల్డ్‌గా, సూటిగా చెప్పడంలో క్వీన్‌ కంగనా రనౌత్‌ ముందుంటారు. ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ స్టార్‌ కిడ్స్‌ను పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపుతారని గతంలో కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై చర్చకు తెరలేపాయి. మణికర్ణిక మూవీ, హృతిక్‌ రోషన్‌తో వివాదం, అలియా భట్‌పై వ్యాఖ్యలు ఇలా ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడిన కంగనా సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. ఇక తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర అంశాలు ముచ్చటించారు.

బంధుప్రీతిపై తరచూ నిప్పులుచెరిగే కంగనా రనౌత్‌ను ఓ 20 ఏళ్ల తర్వాత మీ బిడ్డ తనను నటుడు లేదా, దర్శకుడు కావాలనుకుంటున్నట్టు చెబితే మీరు సహకరిస్తారా లేదా అని ప్రశ్నించగా, తాను అలా చేస్తే తను మంచి దర్శకుడిగా ఎదిగే అవకాశం యాభై శాతమేనని, ఓ తల్లిగా తాను అతడిపై శ్రద్ధ కనబరిస్తే తనకు ఇష్టమైన దారిలోనే వెళ్లేలా వ్యవహరిస్తారను..అప్పుడే తను ఎక్కడున్నా, ఎలా ఉన్నా సంతృప్తికరంగా ఉంటాడని చెప్పుకొచ్చారు.

అయితే తన బిడ్డను అసాధారణ వ్యక్తిగా ఉండాలని తాను కోరుకుంటే మాత్రం అతడిని సముద్రంలో తోసేస్తానని, అతడు అందులో మునకేస్తాడా ఎదురీదుతాడో చూస్తానని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదురీది ఎదిగేలా పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఇక గత నాలుగేళ్లుగా తన సోదరుడు పైలట్‌ కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, ఉద్యోగం కోసం వేచిచూస్తున్నా తానెప్పుడూ అతని కోసం ఎవరికీ ఫోన్‌ చేయలేదని, సహకరించిందీ లేదని బంధుప్రీతిపై తన ఉద్దేశాన్ని తేల్చిచెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top