కాన్స్ చిత్రోత్సవాల్లో కమల్‌హాసన్

కాన్స్ చిత్రోత్సవాల్లో కమల్‌హాసన్


 పద్మభూషణ్ కమలహాసన్ కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. ఫ్రాన్స్ దేశంలో బుధవారం ప్రారంభం కానున్న ఈ చిత్రోత్సవాల్లో పలు దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తారు. ప్రతి ఏడాది మేలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరవుతారు. కాంపిటీషన్స్, నాన్ కాంపిటీషన్ గౌరవ ప్రదర్శన విభాగాల్లో పలు చిత్రాలు ప్రదర్శిస్తారు. వీటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ కళాకారులకు అవార్డులు అందిస్తారు. ప్రపంచంలో అత్యంత ఉత్తమ అవార్డులుగా వీటిని గుర్తిస్తారు. ఈ చిత్రోత్సవాలకు ఈ ఏడాది బాలీవుడ్ నుంచి టిల్లి అనే ఒకే ఒక చిత్రం ఎంపికైంది. కానుబెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యాశ్‌రాజ్ సంస్థ నిర్మించింది. బుధవారం నుంచి ఈ నెల 25 వరకు ఈ కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు చెన్నై నుంచి కమలహాసన్‌తోపాటు ఫిలించాంబర్ కార్యదర్శులు ఎల్.సురేష్, రవి కొటార్కర్, నిర్మాత విశ్వాస్ సుందర్‌లు హాజరవుతున్నారు.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top