న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

Kamal Haasan is back as Senapathi - Sakshi

సమాజంలో లంచాన్ని నిర్మూలించాలని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్‌ పోరాటం చేశారు. ఇప్పుడు మరోసారి సేనాపతిగా తిరిగి రానున్న సంగతి తెలిసిందే. ఈ సేనాపతి తమిళ కొత్త సంవత్సరం రోజున థియేటర్స్‌లోకి రానున్నారని టాక్‌. కమల్‌హాసన్‌ – దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. కాజల్, రకుల్‌ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమల్‌హాసన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్‌ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్‌ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్‌ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top