‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

Junior Artist Sunitha Gives Clarity About Producer Bunny Vasu - Sakshi

ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు తనను ఎప్పుడు శారీరకంగా హింసించలేదని, తప్పుడు ప్రచారం చెయ్యవద్దని జూనియర్‌ ఆర్టిస్ట్‌ బోయ సునీత స్పష్టం చేశారు. బన్నీ వాసు తనను శారీరకంగా హింసించాడని వస్తున్న వార్తలను సునీత ఖండిస్తూ... ఓ వీడియోను షేర్‌ చేశారు.

బన్నీ వాసుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని తన ఫేసుబుక్‌ ఖాతాలో వీడియో పోస్ట్ ద్వారా తెలియజేశారు. జనసేన పార్టీలో ఉన్న సమయంలో తాను నిర్మాత బన్నీ వాసును ఒకటి రెండు సార్లు స్వయంగా కలిశానని తెలిపారు. తర్వాత ఆయనను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన్ని కలవడానికే నిరసన చేస్తున్నట్లు తెలిపారు. అంతేగానీ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు. కాగా బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top