‘నాగార్జున గారు న్యాయం చేయండి’

Jaya Kumar Complaints Against Ram Gopal Varma To Nagarjuna - Sakshi

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆఫీసర్‌’ చిత్ర కథ తనదేనంటూ రచయిత జయకుమార్‌ తెలిపారు. సర్కార్‌3 సమయంలో జయకుమార్‌...వర్మతో కలిసి పని చేశారు. గతంలో ఇలాగే తన కథను కాపీ కొట్టారని జయకుమార్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ‘ ఆఫీసర్‌’ కథ తనదే అంటూ, వర్మ కాపీ కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

జయకుమార్‌ తన ట్వీటర్‌ ఖాతాలో ‘నాగార్జున గారు.. మీరు సదరు డైరెక్టర్‌ గారికి బ్రేక్‌ ఇచ్చారు. కానీ ఆయన కొత్త వాళ్ల కెరీర్‌ను బ్రేక్‌ చేస్తున్నాడు. దయచేసి న్యాయం చేయండి’ అంటూ పోస్ట్‌ చేశారు. జయకుమార్‌ ఆఫీసర్‌ స్క్రిప్టును కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top