‘దొంగ ప్రేమ’లో దమ్ముంది | jai akash donga prema | Sakshi
Sakshi News home page

‘దొంగ ప్రేమ’లో దమ్ముంది

Published Sat, Jan 18 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

‘దొంగ ప్రేమ’లో దమ్ముంది

‘ప్రస్తుతం ఇండస్ట్రీకి నిర్మాతలు చాలా అవసరం. నిర్మాణ వ్యయం అదుపులేని దర్శకుల కారణంగా చాలామంది ఇటు రావడానికి భయపడుతున్నారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకే తక్కువ బడ్జెట్‌లో మంచిక్వాలిటీతో సినిమాలు తీస్తున్నా. ఈ ‘దొంగ ప్రేమ’ కథలో దమ్ముంది’’ అని జై ఆకాష్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ‘దొంగ ప్రేమ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఖాదర్‌వలి సమర్పణలో దినేష్ మ్యాడ్నీ నిర్మించిన ఈ చిత్రంలో ఖుషి ముఖర్జీ, కవితాఛటర్జీ నాయికలు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, మనోజ్ అగర్వాల్, కిశోర్‌కుమార్, నరేష్, అశోక్ వడ్లమూడి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement