సాండల్‌వుడ్‌కు జగ్గుభాయ్‌ | Jagapathi Babu on Baord For Darshan Starrer Roberrt | Sakshi
Sakshi News home page

సాండల్‌వుడ్‌కు జగ్గుభాయ్‌

May 8 2019 3:37 PM | Updated on May 8 2019 3:37 PM

Jagapathi Babu on Baord For Darshan Starrer Roberrt - Sakshi

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆ‍ర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతి బాబు ఇతర భాషల్లోనే అంతే బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కోలీవుడ్, మాలీవుడ్‌ వరుస సినిమాలు చేస్తున్న జగ్గుభాయ్‌ ఇప్పుడు సాండల్‌ వుడ్‌మీద దృష్టి పెట్టాడు. గతంలో సుధీప్‌.. బచ్చన్‌, నిఖిల్‌.. జాగ్వర్‌ చిత్రాల్లో నటించిన జగపతి బాబు కొంత విరామం తరువాత మరో కన్నడ సినిమాకు ఓకె చెప్పాడు.

కన్నడ స్టార్ హీరో దర్శన్‌ హీరోగా తెరకెక్కుతున్న రాబర్ట్ సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటించనున్నాడు. ఈ సినిమా మంగళవారం లాంచనంగా ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాండల్‌వుడ్‌లో కూడా జగపతిబాబు హవా మొదలవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement