ఇచ్చట వాహనములు నిలుపరాదు

itchata vahanamulu niluparadhu poster release - Sakshi

సుశాంత్‌ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిలసౌ’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది. ఇక సుశాంత్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో రవిశంకర్‌ శాస్త్రి, హరీష్‌ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్, మోషన్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top