రాజమౌళి నెక్ట్స్ : మరో ఆసక్తికరమైన అప్ డేట్ | intresting update on rajamoulis multi starrer with ntr ram charan | Sakshi
Sakshi News home page

రాజమౌళి నెక్ట్స్ : మరో ఆసక్తికరమైన అప్ డేట్

Nov 22 2017 1:22 PM | Updated on Jul 14 2019 4:05 PM

intresting update on rajamoulis multi starrer with ntr ram charan - Sakshi - Sakshi

బాహుబలి 2 లాంటి ఘనవిజయం తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ రాజమౌళి బాలీవుడ్ సినిమా చేయనున్నారని, మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే రాజమౌళి మాత్రం అధికారికంగా ఇంతవరకు తన నెక్ట్స్ సినిమా ఎంటన్న విషయాన్ని ప్రకటించలేదు. ఇటీవల రాజమౌళి తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి దిగిన ఫొటో ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా జక్కన్న ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఆ కథ చర్చల్లో భాగంగా వారు దిగిన ఫొటోనే జక్కన ట్వీట్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ కు తగ్గ లైన్ చెప్పి ఓకె చేయించారట, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు ఈ సినిమా 2018 వేసవిలో ప్రారంభించి 2019 వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట, ఈ లోగా చరణ్ రంగస్థలంతో పాటు బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా పూర్తి చేసేస్తాడట, ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రీ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై రాజమౌళి టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement