మా సినిమాపై నమ్మకం ఉంది | Inkenti Nuvve Cheppu audio launched | Sakshi
Sakshi News home page

మా సినిమాపై నమ్మకం ఉంది

Dec 18 2016 11:54 PM | Updated on Sep 4 2017 11:03 PM

మా సినిమాపై  నమ్మకం ఉంది

మా సినిమాపై నమ్మకం ఉంది

సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ముఖ్య తారలు గా తెరకెక్కిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’.

సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. శివ శ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ పతాకంపై డా. మళ్ల విజయ్‌ ప్రసాద్‌ నిర్మించారు. వికాస్‌ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. వినోదం పంచుతూనే సందేశం ఇచ్చేలా ఉంటుంది. మా బ్యానర్‌ విలువకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. ఈ నెలలో పెద్ద చిత్రాల విడుదల ఉన్నప్పటికీ, మా సినిమాపై ఉన్న నమ్మకంతో మేం కూడా ఈ నెలలోనే రిలీజ్‌ చేస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘కొత్త వాళ్లతో సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. విజయ్‌ప్రసాద్‌ ఆ ధైర్యంతోనే ఈ చిత్రం తీశారు. అనుభవం ఉన్నవాడిలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. చిత్ర దర్శకుడు శివ శ్రీ, నిర్మాత కె.ఎస్‌.రామారావు, సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న, వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement