పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకపోతే ఓ పెద్ద ఇడియట్: వర్మ | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకపోతే ఓ పెద్ద ఇడియట్: వర్మ

Published Tue, Oct 1 2013 9:10 PM

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకపోతే ఓ పెద్ద ఇడియట్: వర్మ - Sakshi

అత్తారింటికి దారేది చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అత్తారింటికి దారేది చిత్రం ద్వారా గొప్ప విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజల కోసం రియలైజ్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో అనేక రుజువులు కళ్లముందు కదలాడుతున్నాయి. ఐనా ప్రజల కోసం సంసిద్ధుడై రాజకీయ పార్టీని ప్రారంభించక పోతే ఓ పెద్ద ఇడియెట్ గా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. 
 
గత 40 సంవత్సరాల్లో చిరంజీవి సంపాదించుకున్నమెగాస్టార్ హోదాను పవన్ కళ్యాణ్ అధిగమించాడని, పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ లాంటి బిరుదులు చాలా తక్కువ హోదా అని.. పవర్ స్టార్ అనే హోదాని సునామీ స్టార్ అని మార్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తన జీవిత కాలంలో సాధించే కలెక్షన్లు అత్తారింటికి దారేది మూడు రోజులు వసూలు చేసిన కలెక్షన్లతో సమానం...ప్రపంచంలో చాలా చోట్ల చెన్నై ఎక్స్ ప్రెస్ సృష్టించిన రికార్టులను అత్తారింటికి దారేది చిత్రం అధిగమించింది అని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. 
 
ఇంకా భారతీయ చలన చిత్రసీమ చరిత్రలో తొలిసారి హాలీవుడ్ చిత్ర కంపెనీలు అత్తారింటికి దారేది అనే తెలుగు చిత్రంపై దృష్టిని పెట్టాయని.. తన జీవిత కాలంలో ఏ చిత్రం కూడా ఇవ్వని షాక్ ను అత్తారింటికి దారేది చిత్రం కలెక్షన్లు ఇచ్చాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తనతో అన్నట్టు.. అత్తారింటికి దారేది చిత్రం హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా వసూళ్లను కురిపిస్తోందని ..దరిదాపులో బాలీవుడ్ చిత్రాలే లేవని వర్మ ట్వీట్ చేశాడు. 
 
త్వరలోనే తాను అమెరికాలో అత్తారింటికి దారేది చిత్రం వసూలు చేసిన కలెక్షన్లను అందిస్తానని తరణ్ ఆదర్శ్ చెప్పిన విషయాన్ని.. ఆ కలెక్షన్ల రికార్డులు అందర్ని షాక్ గురిచేస్తాయని...తరణ్ ఆదర్శ్ రిపోర్ట్ తో ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టి అంతా అత్తారింటికి దారేది చిత్రంపై ఉందని వర్మ తన ట్వీట్స్ లో పేర్కోన్నారు. 
Advertisement
Advertisement