హైపర్‌ ఆది లవ్‌ ప్రపోజల్‌..?

hyper aadi photo going to viral on social media - Sakshi

సాక్షి, సినిమా : హైపర్‌ ఆది, బుల్లితెరపై తనదైన శైలిలో సంచులకొద్ది పంచులతో కమెడియన్‌గా రాణిస్తున్న నటుడు. కామెడీ షోలతో పాటు, పలు టీవీ కార్యక్రమాలతో బుల్లితెర అభిమానులను అలరిస్తాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.  సినిమాల్లోను తనదైన మార్క్‌ పంచులను ఏమాత్రం తగ్గించట్లేదు. తాజగా వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాలోను అలరించాడు. పంచ్‌లతో కామెడీ చేశాడు.

రీసెంట్‌గా ఆది ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఓ అమ్మాయికి తన ప్రేమను తెలుపుతున్నట్లుగా చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆఫోటో పెడుతూ  అందరికీ వాలంటైన్స్‌ డే.. స్ప్రెడ్‌ లవ్‌ అంటూ పోస్టు చేశాడు. అయితే అది నిజంగా జరిగింది కాదు. తొలిప్రేమ షూటింగ్‌లో ఉన్నప్పుడు అక్కడ ఓ అమ్మాయిని కలిసి లవర్‌ బాయ్‌లా స్టిల్‌ ఇచ్చాడు. ఇప్పుడు అది కాస్తా సోషల్‌ మీడియా వైరల్‌ అయింది. దీంతో ఫాలోవర్స్‌ అందరూ ఆదికి పంచ్‌లతో పాటు ప్రేమించడం, ప్రపోజ్‌ చేయడం కూడా వచ్చే అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Back to Top