వాలంటైన్స్‌ డే స్పెషల్‌ వచ్చేస్తోంది

How Much Fifty Shades Freed Could Make Opening Weekend - Sakshi

అదొక సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజ్‌. సూపర్‌హిట్‌ అనేకంటే అందరూ మాట్లాడుకునే, చర్చ పెట్టే, గొడవ పెట్టే ఫిల్మ్‌ ఫ్రాంచైజ్‌. రెండు సినిమాలొచ్చాయి ఇప్పటికి ఈ ఫ్రాంచైజ్‌లో! ఈ రెండు సినిమాలనూ ఇటు ఇగ్నోర్‌ చెయ్యలేరు.. అటు పూర్తిగా యాక్సెప్ట్‌ చెయ్యనూలేరు. ఎరోటిక్‌ జానర్‌ సినిమాలను ఇష్టపడేవారికైతే పండగే. యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో, రొమాన్స్‌ అదే రేంజ్‌లో ఉంటుంది. ‘ఫిఫ్టీ షేడ్స్‌’ ఫిల్మ్‌ ఫ్రాంచైజ్‌ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఫిఫ్టీ షేడ్స్‌ ఆఫ్‌ గ్రే (2015), ఫిఫ్టీ షేడ్స్‌ డార్కర్‌ (2017) రెండు సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద దాదాపు బిలియన్‌ డాలర్‌ వసూళ్లు (సుమారు 6,500 కోట్ల రూపాయలు) రాబట్టాయి. తాజాగా ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో మూడో సినిమా ‘ఫిఫ్టీ షేడ్స్‌ ఫ్రీడ్‌’ విడుదలవుతోంది. గత రెండు సినిమాల్లానే ఇది కూడా వాలెంటైన్స్‌ డే కానుకగా విడుదల కానుంది.

కాకపోతే వాలెంటైన్స్‌ డేకి ఐదు రోజులు ముందుగానే.. అంటే ఫిబ్రవరి 9నే! ‘ఫిఫ్టీ షేడ్స్‌’ సిరీస్‌లో ఇది చివరి సినిమా అని ముందే అనౌన్స్‌ చేశారు కాబట్టి అభిమానులకు ఒక రకంగా ఇది స్పెషల్‌ సినిమా. అందుకు తగ్గట్టే ఇప్పట్నుంచే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా మొదలైపోతున్నాయి. ఓపెనింగ్‌ వీకెండ్‌కే 40 మిలియన్‌ డాలర్లు (సుమారు 255కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఈసారి యాక్షన్‌కు పెద్దపీటే వేశారట. ట్రైలర్‌ చూస్తే అభిమానులు ఈ సినిమా నుంచి కోరుకునే అంశాలకు కొదవే లేదని స్పష్టమైపోతోంది. డకోతా జాన్సన్, జేమీ డోర్నన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేమ్స్‌ ఫోలే దర్శకుడు. మరి 2015, 2017లో వాలెంటైన్స్‌ డే సెలెబ్రేషన్స్‌ను రెట్టింపు చేసిన ‘ఫిఫ్టీ షేడ్స్‌’ ఈసారి కూడా మెప్పిస్తుందా? చూడాలి!!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top