అభిమానుల ప్రేమ వేరయా | Hansika (@ihansika) | Sakshi
Sakshi News home page

అభిమానుల ప్రేమ వేరయా

Nov 24 2018 5:14 AM | Updated on Nov 24 2018 5:14 AM

Hansika (@ihansika) - Sakshi

హన్సిక

ప్రేమలందు అభిమానుల ప్రేమ వేరయా! అవును నిజమే.. తమ అభిమాన తార మీద ప్రేమను పలువురు పలు రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ అభిమానే హన్సికాకు ట్వీటర్‌లో తారసపడ్డారు. ‘హన్సికే నా జీవితం’ అంటూ 28 భాషల్లో రాసి హన్సికకు ట్వీటర్‌లో తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ 28 భాషల శ్రమ వృథా పోలేదు. ఈ అభిమానం హన్సిక కళ్లలో పడింది. ‘వావ్‌ చాలా స్వీట్‌. థ్యాంక్యూ’ అంటూ ఆ అభిమాని ప్రేమను గుర్తించారు.  ఇలాంటి అభిమానమే స్టార్స్‌ ఇంకా కష్టపడి పని చేయడానికి బూస్ట్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హన్సిక తమిళ చిత్రాలు ‘తుపాక్కి మున్నై, 100’లతో బిజీగా ఉన్నారు. అలాగే తన 50వ చిత్రం ‘మహా’ కోసం సిద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement