స్నేహితుడి రిక్వెస్ట్ | Friend Requests movie Aditya Om | Sakshi
Sakshi News home page

స్నేహితుడి రిక్వెస్ట్

Oct 5 2015 11:44 PM | Updated on Sep 3 2017 10:29 AM

స్నేహితుడి రిక్వెస్ట్

స్నేహితుడి రిక్వెస్ట్

లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో చలాకీగా నటించిన ఆదిత్యా ఓం తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తున్నాడు.

 లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో చలాకీగా నటించిన ఆదిత్యా ఓం తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తున్నాడు. అతనిప్పుడు దర్శక, నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఆదిత్యా ఓం స్వీయదర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆదిత్యా ఓం మాట్లాడుతూ -‘‘సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెలాఖరులోగా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. త్వరలోనే పాటలను, నవంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేశామని, అవసరమైతే సొంతంగా అయినా విడుదల చేస్తామని మరో నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి చెప్పారు.
 
 చెరుపల్లిని దత్తత తీసుకున్న ఆదిత్య
 సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటితో కలిసి ఆదిత్యా ఓం ‘ఎడ్యులైట్‌మెంట్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం దగ్గర్లోని చెరుపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. తమ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం గత నెల సెప్టెంబరు 3న న్యూఢిల్లీలో, అక్టోబరు 2న ముంబైలో నిరాహార దీక్ష చేశామని ఆదిత్యా ఓం తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement