'సెన్సార్ బోర్డు గురించి అసలు వర్రీ అవ్వను' | Filmmaker Pooja Bhatt set to direct 'Jism 3' | Sakshi
Sakshi News home page

'సెన్సార్ బోర్డు గురించి అసలు వర్రీ అవ్వను'

Feb 10 2016 4:47 PM | Updated on Apr 3 2019 6:23 PM

'సెన్సార్ బోర్డు గురించి అసలు వర్రీ అవ్వను' - Sakshi

'సెన్సార్ బోర్డు గురించి అసలు వర్రీ అవ్వను'

బాలీవుడ్ లో హాట్ మూవీస్ సిరీస్ లుగా 'జిస్మ్', 'జిస్మ్ 2' ఇది వరకే వచ్చాయి. తాజాగా ఈ సిరీస్ లో మూడో సినిమా 'జిస్మ్ 3' తీసేందుకు సిద్ధంగా ఉన్నమని దర్శకురాలు, నిర్మాత పుజా భట్ తెలిపారు.

ముంబై: బాలీవుడ్ లో హాట్ మూవీస్ సిరీస్ లుగా 'జిస్మ్', 'జిస్మ్ 2' ఇది వరకే వచ్చాయి. తాజాగా ఈ సిరీస్ లో మూడో సినిమా 'జిస్మ్ 3' తీసేందుకు సిద్ధంగా ఉన్నమని దర్శకురాలు, నిర్మాత పుజా భట్ తెలిపారు. జిస్మ్ సిరీస్ అన్నింటిలోనూ ఉత్తమంగా ఈ మూవీ ఉండబోతుందని అశాభావం వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివరికల్లా ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది 'జిస్మ్ 3' విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మూడో సిరీస్ మూవీలో ముగ్గురు యువకులు, ఓ మహిళ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని చెప్పింది.

పాప్, హాలిడే లాంటి మూవీలకు దర్శకురాలిగా చేసిన పూజా.. సెన్సార్ బోర్డు గురించి తాను అంతగా వర్రీ కాను అంటూ చెప్పేసింది. తనకు సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి సమస్యలు లేవని, గతంలో జిస్మ్ కోసం పోరాటం చేయగా ఆ మూవీకి ఒక్క దగ్గర కత్తెర పడిందని వివరించింది. రోగ్ మూవీతో తనపై కేసు నమోదుకాగా, ఏ ఒక్కరూ సాయపడలేదని తెలిపింది. కేవలం తాను మాత్రమే ఎనిమిదేళ్లు పోరాటం సాగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా భట్ 'క్యాబరే'  చిత్ర నిర్మాణంలో బిజీబిజీగా ఉంది. రిచా ఛద్దా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2012లో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ లో 'జిస్మ్ 2' ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జిస్మ్ కు నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన పూజా భట్ 'జిస్మ్ 2' కు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement