అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌ | Evaru Team Requests Not To Reveal Twists in Social Media | Sakshi
Sakshi News home page

అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌

Aug 16 2019 9:38 AM | Updated on Aug 16 2019 9:38 AM

Evaru Team Requests Not To Reveal Twists in Social Media - Sakshi

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో అడివి శేష్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కట్టిపడేసే కథా కథనాలతో ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిన శేష్‌పై అభినందనల జల్లు కురుస్తోంది. అయితే కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో సినిమాలోని కీలక ‍ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో లీక్‌ చేస్తున్నారు.
(మూవీ రివ్యూ : ‘ఎవరు’)

ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ లీకులపై ఎవరు టీం స్పందించింది. ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసిన అడివి శేష్‌, నవీన్‌ చంద్ర, రెజీనాలు ట్విస్ట్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయోద్దని రిక్వెస్ట్ చేశారు. తనకు ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement