కృతిక దర్శకత్వంలో ధనుష్ చిత్రం | Dhanush in the film directed by krutika | Sakshi
Sakshi News home page

కృతిక దర్శకత్వంలో ధనుష్ చిత్రం

Jun 7 2014 12:11 AM | Updated on Sep 2 2017 8:24 AM

కృతిక దర్శకత్వంలో ధనుష్ చిత్రం

కృతిక దర్శకత్వంలో ధనుష్ చిత్రం

కోలీవుడ్‌లో ఒక క్రేజీ చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, యువ నటుడు ధనుష్, డీఎంకే నేత స్టాలిన్ కోడలు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధి కలయికలో చిత్రం తెరకెక్కనుంది.

కోలీవుడ్‌లో ఒక క్రేజీ చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, యువ నటుడు ధనుష్, డీఎంకే నేత స్టాలిన్ కోడలు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధి కలయికలో చిత్రం తెరకెక్కనుంది. కృతిక ఇప్పటికే వణక్కం చెన్నై అనే చిత్రంతో దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకున్నారు. అలా గే ధనుష్ తన ఉండెర్‌బార్ ఫిలింస్ పతాకంపై నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు కృతిక దర్శకత్వంలో చిత్రం రూపొందించడానికి రెడీ అవుతున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో కృతిక భర్త, నటుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రానికి సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుద్ పని చేయనున్నట్లు తెలిసింది. కృతిక, అనిరుద్ ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రానికి కలిసి పని చేయడం గమనార్హం.
 
ధనుష్ ఒక పక్క హీరోగా హిందీలో బాల్కి దర్శకత్వంలో షమితబ్ చిత్రంతోపాటు తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేగన్, వేల్లై ఇల్లా పట్టదారి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోపక్క శివకార్తికేయన్ హీరోగా తానా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా కృతిక దర్శకత్వంలో మరో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement