గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధనుష్ | Dhanush finally says yes to director Gautham Menon! | Sakshi
Sakshi News home page

గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధనుష్

Feb 20 2016 2:50 AM | Updated on Apr 3 2019 9:01 PM

గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధనుష్ - Sakshi

గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధనుష్

కోలీవుడ్‌లో ఒక కొత్త కాంబినేషన్‌కు శ్రీకారం జరగనుంది. కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నటుడు ధనుష్ అన్న విషయం తెలిసిందే.

కోలీవుడ్‌లో ఒక కొత్త కాంబినేషన్‌కు శ్రీకారం జరగనుంది. కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నటుడు ధనుష్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్,బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్ వెళ్లనున్నారు. ఇక ప్రేమ కథా చిత్రాలనుంచి యాక్షన్ కథా చిత్రాల వరకూ తనదైన శైలిలో తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్. అలాంటి వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకూ చిత్రం రాలేదు. వస్తే బాగుంటుందనే ఆసక్తి చాలా మందికి ఉంది. ఈ అరుదైన కాంబినేషన్‌లో ఇన్నాళ్లకు ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం.

ధనుష్ ప్రస్తుతం ప్రభుసాలమన్ దర్శకత్వంలో రైలు చిత్రాన్ని పూర్తి చేసి కొడి చిత్రంలో నటిస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కమర్షియల్ కథా చిత్రం. ఇందులో నటి త్రిష రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి పాత్రను పోషించడం విశేషం. మరో నాయకిగాఅనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తదుపరి హాలీవుడ్ చిత్రంతో పాటు, వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రం చేయాల్సి ఉంది.

అయితే వాటిని వెనక్కి నెట్టి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ముందు నటించనున్నారు. ఈ విషయాన్ని ధనుష్  తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.దీనికి ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అనే టైటిల్‌ను నిర్ణయించారు. గౌతమ్‌మీనన్ శింబు హీరోగా అచ్చం యంబదు మడమయడా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత జయంరవి కథానాయకుడిగా ధ్రువనక్షత్రం చేయాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసి ధనుష్‌తో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement