ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం ప్రారంభం | Dhanush begins his Extraordinary Journey in Hollywood. See pics from Mumbai sets | Sakshi
Sakshi News home page

ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం ప్రారంభం

May 17 2017 3:02 AM | Updated on Sep 5 2017 11:18 AM

ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం ప్రారంభం

ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం ప్రారంభం

నటుడు ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రంలో నటించనున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అది ఇటీవల ప్రారంభమైంది.

నటుడు ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రంలో నటించనున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అది ఇటీవల ప్రారంభమైంది. ధనుష్‌ ప్రస్తుతం ఎన్నైనోక్కి పాయుం తోట్టా, వడచెన్నై, వేలై ఇల్లా పట్టాదారి 2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ధనుష్‌ తాజాగా హాలీవుడ్‌ చిత్రానికి మూడు నెలలు కాల్‌షీట్స్‌ కేటాయిం చారు.

 బాగా పాపులర్‌ అయిన ఫ్రెంచ్‌ నవల ఆధారంగా కెనడాకు చెందిన కెన్‌ స్కాట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆష్‌ ఫకీర్‌ అనే పేరును నిర్ణయించారు. ఇటీవలే బెల్జియంలో షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రం ఏకధాటిగా చిత్రీకరణను జరుపుకోనుందట. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ధనుష్‌ నిర్మాణంలో ఉన్న వడచెన్న, ఎన్నై నోక్కి పాయుం తోట్టా చిత్రాలపై దృష్టిసారించనున్నారట. వీటితో పాటు దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement