లీకైన దీపిక ‘ఛాపాక్‌’ ఆన్‌లొకేషన్‌ వీడియో

Deepika Padukone Chhapaak Scene Leaked - Sakshi

భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. టాప్‌స్టార్లు నటించే సినిమాలు ఆన్‌ లొకేషన్‌ ఫోటోలు, వీడియోలు ఏదో ఒక రకంగా సోషల్‌ మీడియాలో లీక్‌ అవుతున్నాయి. తాజాగా మరో భారీ చిత్రం లీకువీరుల బారిన పడింది. దీపిక పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ఛాపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా దీపిక స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మేఘ్న గుల్జార్‌ దర్శకురాలు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో దీపికా లుక్‌కు సంబంధించి పలు ఫోటోలను ఇప్పటికే చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఇటీవల దీపిక కూడా లొకేషన్‌లో దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top