నటుడిని ఇంట్లోంచి గెంటేసిన భార్య! | Deepak Tijori’s wife Shivani throws him out, he realises they are not even married? | Sakshi
Sakshi News home page

నటుడిని ఇంట్లోంచి గెంటేసిన భార్య!

Mar 31 2017 4:40 PM | Updated on Apr 3 2019 6:34 PM

నటుడిని ఇంట్లోంచి గెంటేసిన భార్య! - Sakshi

నటుడిని ఇంట్లోంచి గెంటేసిన భార్య!

బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు.

ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు. దీపక్ భార్య శివాని తోమర్ ఆయనను ఇంటిని నుంచి బయటకు గెంటేసినట్టు వచ్చినట్టు వార్తలు బాలీవుడ్ లో కలకలం రేపాయి. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆయనను శివాని వెళ్లగొట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన స్నేహితుల ఇళ్లలో లేదా పెయింగ్ గెస్ట్ అకాండేషన్స్ లో ఉంటున్నట్టు సమాచారం.

చాలా ఏళ్లుగా కలిసివుంటున్న వీరిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదని వెల్లడైంది. వీరిద్దరికీ 21 ఏళ్ల సమారా అనే కుమార్తె ఉంది. శివాని తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదని, న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దీపక్ ను పెళ్లి చేసుకోలేదని సమాచారం. కాగా, తమ పోషణకు దీపక్ డబ్బులు ఇవ్వడం లేదని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శివానికి వ్యతిరేకంగా దీపక్ కేసు వేయడంతో వీరిద్దరి గొడవలు రచ్చకెక్కాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో ఉంది.

దీపక్ దంపతుల మధ్య కలహాలు ఉన్న మాట వాస్తమేనని శివాని సోదరి, గాయకురాలు కనికాలాల్ ధ్రువీకరించింది. ‘దీపక్ కు సొంత ఇల్లు ఉంది. స్నేహితుల ఇళ్లలో గడపాల్సిన అవసరం ఆయనకు లేదు. దీపక్, శివాని మధ్య విభేదాలున్నాయి. వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయాలనుకోవడం లేదు. వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకుండా ఉండడం ఎలా సాధ్యం? ఇదంతా మీడియా కుట్ర. ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు రాయొద్దని మీడియాను వేడుకుంటున్నా. ఈ వ్యవహారం కోర్టులో ఉంది, తీర్పు కోసం వేచిచూద్దామ’ని కనికాలాల్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement