
కష్టపడితే విజయమే : దాసరి
బాబు నాయక్ బాగా కష్టపడతాడు అదే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ చిత్రం విజయం సాధించి టీమ్‌కు మంచి పేరు రావాలి’’
‘‘బాబు నాయక్ బాగా కష్టపడతాడు అదే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ చిత్రం విజయం సాధించి టీమ్‌కు మంచి పేరు రావాలి’’అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. బాబు నాయక్, కులకర్ణి మమత జంటగా అమూల్య ప్రొడక్షన్స్ సమర్పణలో రఘు పూజారి దర్శకత్వంలో గుర్రపు విజయ్ కుమార్ నిర్మిస్తున్న ‘డబ్బా శీను’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కెమేరా స్విచ్చాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. తొలిషాట్‌కు దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.