సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

Curtain Raiser Event Of 25 Years of Telugu Cine Production Executives Union - Sakshi

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లంద‌రూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కర్టన్ రైజర్ ప్రెస్‌మీట్ జ‌రిగింది. క‌ళాబంధు టి. సుబ్బిరామి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ... క‌ళాబంధు టి.సుబ్బ‌రామి రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరంలో సినీ ఆర్టిస్ట్‌లంద‌రూ క‌లిసి చాలా కాలం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత ప్రొడక్షన్ మేనేజర్లు కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్‌కు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అన్నారు.

ప్రొడ‌క్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్ అమ్మిరాజు మాట్లాడుతూ ‘మేం చేస్తున్న ప్రయ‌త్నానికి స‌హ‌క‌రిస్తున్న అంద‌రికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. స‌పోర్ట్ చేస్తోన్న జెమినీ కిర‌ణ్‌గారికి థ్యాంక్స్‌. సుబ్బిరామి రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేరు పేరున ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన వారందరికి థాంక్స్ తెలుపుతున్నాను. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్‌కు ఇలాగే అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

వీరితో పాటు మా అధ్యక్షుడు వికె నరేష్‌, ఉపాధ్యక్షుడు డా. రాజశేఖర్‌, నటులు అల్లరి నరేష్‌, సందీప్‌ కిషన్‌, ప్రగ్యా జైస్వాల్, రెజీనా,  వెన్నెల కిశోర్‌, సంపూర్ణేష్ బాబు, శివ బాలాజీ, రాజీవ్‌ కనకాల, హేమ, ఉత్తేజ్‌, నిర్మాతలు సీ కల్యాణ్‌, ఎమ్‌ఎల్‌ కుమార్ చౌదరి, దామోదర్‌ ప్రసాద్‌, దర్శకులు బాబీ, బొమ్మరిల్లు భాస్కర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ నిర్వాహకులకు తమ మద్ధుతు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top