నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్ | Brother of Bommali music out | Sakshi
Sakshi News home page

నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్

Oct 5 2014 11:51 PM | Updated on Sep 2 2017 2:23 PM

నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్

నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్

‘‘నరేశ్ మినిమమ్ గ్యారంటీ హీరో. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఈవీవీ సత్యనారాయణ

‘‘నరేశ్ మినిమమ్ గ్యారంటీ హీరో. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’. ‘అల్లరి’ నరేశ్, మోనాల్ గజ్జర్ జంటగా బి. చిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర పాటలు స్వరపరిచారు. తొలి సీడీని శాసనసభ్యుడు, నిర్మాత మాగంటి బాబు ఆవిష్కరించి బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని బోయపాటి ఆవిష్కరించారు.
 
 ఈవీవీ తనకు మంచి మిత్రుడని, ఆయన లేకపోవడం బాధాకరమని, నరేశ్, రాజేష్ తండ్రి పేరుని నిలబెడుతున్నారని మాగంటి బాబు అన్నారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ - ‘‘కథానాయికగా కొనసాగుతున్నప్పటికీ కార్తీక ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చేసి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. మేమిద్దరం పోటీ పడి నటించాం. ఈ చిత్రం తర్వాత చిన్ని బిజీ డెరైక్టర్ అవుతాడు’’ అని తెలిపారు. దర్శకునిగా ఒకే ఒక్క సినిమా చేసిన తనతో 47 సినిమాలు చేసిన నరేశ్ సినిమా చేయడం గొప్ప విషయమని, విజయవంతమైన సినిమా చేయడానికి అందరం కృషి చేశామని చిన్ని అన్నారు. ఇందులో ఉన్న అన్నా, చెల్లెలి సెంటిమెంట్ అందరికీ నచ్చుతుందని అమ్మిరాజు చెప్పారు. శేఖర్‌చంద్ర, కార్తీక, మోనాల్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement