మ‌రోసారి అరెస్ట‌యిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ | Bigg Boss Contestant Ajaz Khan Arrested For Objectionable Post | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అరెస్ట్‌

Apr 19 2020 12:06 PM | Updated on Apr 19 2020 12:19 PM

Bigg Boss Contestant Ajaz Khan Arrested For Objectionable Post - Sakshi

బాలీవుడ్ న‌టుడు, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ మ‌రోసారి అరెస్ట‌య్యాడు. ఫేస్‌బుక్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినందుకుగానూ ముంబై పోలీసులు అత‌డిని శ‌నివారం అదుపులోకి తీసుకున్నారు. హిందీ బిగ్‌బాస్ 7వ సీజ‌న్‌లో పాల్గొన్న అజాజ్ ఖాన్ అటు బాలీవుడ్ చిత్రాల‌తో పాటు టాలీవుడ్‌లోనూ న‌టించాడు. దూకుడు, బాద్‌షా, హార్ట్ ఎటాక్‌, నాయ‌క్‌, టెంప‌ర్ వంటి ప‌లు చిత్రాల్లో క‌నిపించాడు. తాజాగా శ‌నివారం నాడు అభిమానుల‌తో ఫేస్‌బుక్ లైవ్ చేస్తున్న ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేశాడు. (జీన్స్‌ వేసుకుంటే ట్రాన్స్‌జెండర్లు పుడతారు)

క‌రోనా వైర‌స్‌, త‌బ్లిగి జ‌మాత్‌ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చి ముస్లింల‌ను ఉద్దేశిస్తూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డంతో అత‌నిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా గ‌తంలోనూ అజాజ్ ఖాన్‌పై ప‌లుసార్లు కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. గ‌తేడాది మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ఉన్న అభ్యంత‌ర‌క‌ర వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా పోలీసులు అరెస్టు చేశారు. అంత‌కుముందు 2016లో ఓ బ్యూటీషియ‌న్‌ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్ర‌గ్స్ కేసులో పోలీసుల చేతికి చిక్కిన సంగ‌తి తెలిసిందే. (బిగ్‌బాస్‌-4: హోస్ట్‌గా మహేశ్‌ బాబు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement