బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

Bigg Boss 3 Telugu Is Srimukhi Breaks Her Friendship With Baba Bhaskar  - Sakshi

బాబా భాస్కర్‌కు జాఫర్‌ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్‌ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్‌, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్‌ను తనను విడదీస్తున్నారని మహేశ్‌ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్‌ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్‌ ప్రెండ్స్‌గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్‌షిప్‌ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్‌ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది.

బాబా కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎలిమినేషన్‌లో ఉన్న ఇంటిసభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్‌ చేయవచ్చు అని బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. అప్పుడు నామినేట్‌ అయిన ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, మహేశ్‌ ఉన్నప్పటికీ వారిద్దరూ కాదని రవిని సేవ్‌ చేశాడు. ఆ విషయాన్ని శ్రీముఖి అంత సులువుగా జీర్ణించుకోలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని నెమ్మదిగా మర్చిపోతున్న శ్రీముఖికి బాబా భాస్కర్‌ నుంచి మరో ఊహించని షాక్‌ ఎదురైంది. 

పదోవారానికిగానూ జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో శివజ్యోతి శ్రీముఖిలో ఎవరో ఒకరు నామినేట్‌ అవాలి. ఇద్దరికీ చెరి సమానమైన ఓట్లు పడ్డాయి. దీంతో బాబా భాస్కర్‌ ఇచ్చే ఓటు కీలకంగా మారింది. బాబా భాస్కర్‌.. శ్రీముఖిని సేవ్‌ చేస్తాడనుకుంటే అంతా తలకిందులైంది. శివజ్యోతిని సేవ్‌ చేస్తున్నట్టు తెలపడంతో శివజ్యోతి కన్నా ఒక్క ఓటు తక్కువ రావటంతో శ్రీముఖి ఎలిమినేషన్‌ రౌండ్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం ఇంటి సభ్యులను షాక్‌కు గురిచేస్తోంది. ఇదే విషయాన్ని వరుణ్‌ బాబాతో ప్రస్తావించగా శ్రీముఖి హార్ష్‌గా మాట్లాడిందని, అది నచ్చకే తనను సేవ్‌ చేయలేదని చెప్పాడు. ఈ ఘటనతో శ్రీముఖి ఒక్కసారిగా డీలా పడిపోయింది. నాకంటూ ఇంట్లో ఎవరూ లేరంటూ బాధపడింది. మరి బాబా భాస్కర్‌, శ్రీముఖిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేక్‌ అయిందా? అన్నీ మర్చిపోయి మునుపటిలా కొనసాగుతారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top