బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

Bigg Boss 3 Telugu Punarnavi Fires On Task In Eight Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ దెయ్యాల కోటగా మారింది. ఇంట్లోని కొంతమందిని దెయ్యాలుగా మార్చిన బిగ్‌బాస్‌.. మిగతావారిని హత్య చేసి దెయ్యాలుగా మార్చాలనే టాస్క్‌ ఇచ్చాడు. వితికా, బాబా, హిమజ, రాహుల్‌, శిల్పాలు దెయ్యాలుగా అవతారమెత్తుతారని తెలిపాడు. ఈ దెయ్యాలు మనుషులను విసిగిస్తూ ఉండాలని చివరకు హత్య చేయాల్సి ఉంటుందని సూచించాడు. 

ఈ క్రమంలో శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టాలని, వరుణ్‌కు మూడుసార్లు ముద్దుపెట్టాలని, బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఘోస్ట్‌ అని రాయాలని, మహేష్‌ చేత ఐదుసార్లు షర్ట్‌ విప్పేలా చేయాలని, పునర్నవిని స్విమ్మింగ్‌పూల్‌లో పడేయాలని, రవి చేత డ్యాన్సులు చేయించాలని, శివజ్యోతిని ఏడ్పించాలనే టాస్క్‌లను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా మొదటి రోజు ముగ్గురిని మాత్రమే హత్య చేయాలని తెలిపాడు.

దీంతో దెయ్యాలు బిగ్‌బాస్‌ హౌస్‌ను గందరగోళంగా మార్చేశాయి. అందర్నీ ఏడిపిస్తూ, విసిగిస్తూ.. మనుషులను వేధించసాగాయి. ఈ క్రమంలో వరుణ్‌ సందేశ్‌ను వితికా మూడుసార్లు ముద్దుపెట్టింది. అనంతరం బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఏ ఘోస్ట్‌ అని రాయడంతో.. వరుణ్‌ హత్యుకు గురైనట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో వరుణ్‌ దెయ్యంగా, వితికా మనిషిగా మారింది.

మరోవైపు శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టింది. దీంతో శ్రీముఖి సైతం హత్యకు గురైనట్లు ప్రకటించాడు. వితికా, శిల్పా, బాబా భాస్కర్‌లు కలిసి పునర్నవిని స్విమ్మింగ్‌ పూల్‌లో పడేశారు. అయితే ఒకసారి ఒక మనిషిని మాత్రమే చంపేయాల్సి ఉండగా.. శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టడం, పునర్నవిని తోసేయడం ఒకేసారి జరిగాయి. పూల్‌ వద్ద కూర్చొన్న పునర్నవిని శిల్పా మరోసారి తోసేసింది. దీంతో పునర్నవి సైతం హత్యకు గురైందని తెలిపాడు.

తనను ఈడ్చుకుని పూల్‌లో పడేశారని, కూర్చొని ఉన్నా.. మళ్లీ తోసేశారని పునర్నవి ఫైర్‌ అయింది. తాను ఈ గేమ్‌ ఆడబోనని తెగేసి చెప్పింది. కావాలంటే ఈ ఆట మీరే ఆడుకోండని బిగ్‌బాస్‌నే ఎదిరిచింది. అయితే ఇదంతా టాస్క్‌లో భాగమని వరుణ్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. పునర్నవి కూల్‌ కాలేదు. అయితే బిగ్‌బాస్‌ ఆదేశాలను ధిక్కరించినందుకు పునర్నవి, శ్రీముఖి, మహేష్‌లకు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. హౌస్‌మేట్స్‌ ఈ టాస్క్‌ను అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

17-09-2019
Sep 17, 2019, 13:23 IST
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు...
17-09-2019
Sep 17, 2019, 11:38 IST
బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.....
17-09-2019
Sep 17, 2019, 11:07 IST
గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం...
17-09-2019
Sep 17, 2019, 10:01 IST
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు...
17-09-2019
Sep 17, 2019, 08:34 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం...
16-09-2019
Sep 16, 2019, 22:50 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఓ...
16-09-2019
Sep 16, 2019, 20:06 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి...
16-09-2019
Sep 16, 2019, 18:05 IST
గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. రెండో సీజన్‌లో  నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా...
16-09-2019
Sep 16, 2019, 17:21 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు...
15-09-2019
Sep 15, 2019, 22:23 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు....
15-09-2019
Sep 15, 2019, 20:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు....
14-09-2019
Sep 14, 2019, 22:58 IST
బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు...
14-09-2019
Sep 14, 2019, 19:33 IST
బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు...
14-09-2019
Sep 14, 2019, 19:06 IST
బిగ్‌బాస్‌లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఒకెత్తు...
14-09-2019
Sep 14, 2019, 17:07 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారంలో కొందరు ఇంటిసభ్యులు తిరుగుబాటు చేశారు. బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించారు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
14-09-2019
Sep 14, 2019, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం...
13-09-2019
Sep 13, 2019, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్‌ ఐటమ్స్‌ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్‌ లభించాయి....
13-09-2019
Sep 13, 2019, 18:00 IST
అవును మహేష్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాలి. అసలే...
13-09-2019
Sep 13, 2019, 17:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్‌ ఇవ్వాలన్నా.. సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వాలన్నా.. అలాంటి...
13-09-2019
Sep 13, 2019, 16:17 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top