అది సమస్యగా అనిపించడం లేదు!

ayushmann khurrana bollywood entry to Vicky Donor - Sakshi

బాలీవుడ్‌లో నటుడు ఆయుష్మాన్‌ ఖురానా కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘అంధాధూన్, బదాయి హో’ చిత్రాలు హిందీ చిత్రపరిశ్రమలో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. సినిమాల్లోకి రాకముందు రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేశారు ఆయుష్మాన్‌. ఆయనకు చెప్పుకోదగ్గ ఫిల్మీ బ్యాగ్రౌండ్‌ లేదు. ‘‘స్టార్‌ కిడ్‌ అయ్యి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి’’ అని మీరు ఆలోచిస్తున్నారా? అన్న ప్రశ్నను ఆయుష్మాన్‌ ముందు ఉంచితే... ‘‘నా 27 ఏళ్ల వయసులో నేను ‘విక్కీ డోనర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాను.

అదే నేను స్టార్‌ కిడ్‌ అయితే 22 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చే వాడినేమో. కానీ ఈ ఐదేళ్ల వ్యత్యాసం నాకు పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఎందుకంటే 17 ఏళ్లకే రియాలిటీ షోలో పాల్గొన్నాను. 22 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఉన్న యంగెస్ట్‌ రెడీయో జాకీని నేనే. ఇలా అన్ని రకాల ప్లాట్‌ఫామ్స్‌ను దాటుకుంటూ వచ్చాను. ఎక్కువమంది యాక్టర్స్‌కు ఇది సాధ్యం కాకపోవచ్చు. 27 ఏళ్ల వయసులో ఒక యాక్టర్‌కు ఉండాల్సిన మెచ్యూరిటీ థింకింగ్‌ కన్నా ఇప్పుడు నా ఆలోచన స్థాయి ఎక్కువ అని చెప్పగలను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top