వెండితెర ఎంజీఆర్‌

Arvind Swamy to play MG Ramachandran in Thalaivi - Sakshi

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెర కెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. (హిందీలో ‘జయ’). ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఇవాళ ఎం.జి రామచంద్రన్‌ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని అరవింద స్వామి లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన  కంగనా రనౌత్‌ ఫస్ట్‌ లుక్, టీజర్‌లకు మంచి స్పందన లభిస్తోంది. ఎంజీఆర్‌ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటిస్తున్నారు అరవిందస్వామి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘తలైవి’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top