మరో భక్తి చిత్రం? | Sakshi
Sakshi News home page

మరో భక్తి చిత్రం?

Published Mon, Mar 11 2019 12:40 AM

Anushka Shetty in devotional film on Lord Ayyappa - Sakshi

‘దళపతి, రోజా, దిల్‌ సే, రావన్, నవాబ్‌’ వంటి భారీ సినిమాలకు కెమెరామెన్‌గా పని చేశారు సంతోష్‌ శివన్‌. భారతదేశంలోని టాప్‌ కెమెరామెన్‌ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంటారాయన. అప్పుడప్పుడూ ఆయన డైరెక్టర్‌గా మారుతుంటారు కూడా. దర్శకునిగా ‘అశోక, ఉరిమి, నవరస’ వంటి చిత్రాలను రూపొందించిన ఆయన ఓ భారీ బడ్జెట్‌ డివోషనల్‌ మూవీ ప్లాన్‌ చేశారు. అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోంది. మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీ గోకులన్‌ గోపాలన్‌ నిర్మించనున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్రలో అనుష్క కనిపిస్తారని టాక్‌. సౌత్‌లో అనుష్క క్రేజ్‌ దృష్టిలో ఉంచుకొని ఆమెను సంప్రదించారని ఊహించుకోవచ్చు. ఆల్రెడీ ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తి చిత్రంలో అనుష్క కనిపించిన సంగతి తెలిసిందే. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘‘ఈ చిత్రం అయ్యప్ప జీవితంపై ఎక్కువ ఫోకస్‌ చేస్తుంది. యువరాజుగా, యోధుడిగా అయ్యప్ప ఏంటి? అనేది మా సినిమాలో చూపిస్తాం’’ అని శ్రీ గోకులన్‌ గోపాలన్‌ పేర్కొన్నారు. ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement