ఆది స్కిట్‌ పై అనసూయ కామెంట్‌

Anasuya supports hyper aadi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

హైదరాబాద్‌ : సినిమా షూటింగ్‌లో గ్యాప్‌ దొరకడంతో యాంకర్‌, నటి అనసూయ తన అభిమానులతో ముచ్చటించారు. ‘సచ్చిందిరా గొర్రె’ చిత్ర షూటింగ్ నిమిత్తం నైట్ షూటింగ్‌లో ఉండటం వల్లే, చాలా రోజులుగా ఫేస్ బుక్ లైవ్‌ లోకి రాలేకపోయానని తెలిపారు. ఈ సందర్భంగా అనాథపిల్లలపై జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది చేసిన స్కిట్‌పై అనసూయ స్పందించారు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆంటీ ఏంటండీ..
ఓ అభిమాని హాయ్‌ అనూ ఆంటీ అంటూ కామెంట్‌ పెట్టాడు. దీనికి అనసూయ అతడికి ఘాటుగా బుదులిచ్చారు. ఆంటీ అంటే అదో బూతులా చేసేశారు. నేను చాలా మందిని ఆంటీ అంటూ సంబోధిస్తుంటాను. వాళ్లందరూ బూతులా ఫీల్‌ అవ్వాలా. ఇంకోసారి దీనిపై స్పందించను. కాస్త చదువుకున్నవారిలా ప్రవర్తించండి. నా పిల్లల స్నేహితులు ఆంటీ అంటే పలుకుతా కానీ, మీసాలు గడ్డాలు పెట్టుకొని మీరు నాకు అంకుల్‌లా ఉండి ఆంటీ ఎంటండి అంటూ మండిపడ్డారు. నేను చాలా మంచి మూడ్‌లో ఉన్నా కాస్త సరదగా సంభాషిద్దాం అంటూ ఫేస్‌ బుక్‌ లైవ్‌ను ప్రారంభించారు.

అభిమాని కామెంట్‌ : ఆది చేసిన స్కిట్‌పై మీ అభిప్రాయం ఏంటి ?
క్రియేటివిటీని తొక్కేయొద్దు..
'కొన్ని విషయాలలో కొందరు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. నాకు కానీ, చేస్తున్న వారికి కానీ, చూస్తున్న వారందరూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో జబర్ధస్త్ హిస్టరీ క్రియేట్ చేసిందని ఒప్పుకోవాల్సిందే. ఒక షో ఇంతగా ఆదరణ దక్కించుకోవడం అనేది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మన తెలుగు టెలివిజన్‌ని టాప్ లెవల్‌లో నిలబెట్టిన ఘనత జబర్ధస్త్‌ది. బాహుబలి ఎలానో జబర్దస్త్ కూడా అంతే. అలాంటి విజన్‌ని ఇందులో చూస్తున్నాం. మేం చాలా కష్టపడుతున్నాం. నా కంటే రోజా, నాగబాబు, టీమ్ మెంబర్స్ ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి షో ని నిర్భందించాలని చూడకూడదు. క్రియేటీవిటీని తొక్కేయవద్దు  

నవ్వుకోండి అంతే...
ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న వాళ్లు చేసిన స్కిట్ అలాంటిది. వాళ్లంతా అనాథశ్రమంకి వెళతారు. అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం అలా తీసుకున్నారు. నవ్వుకోండి అంతే. మా ఉద్దేశ్యం నవ్వించడమే. లైఫ్‌లో వచ్చే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకి కట్టినట్లు చూపిస్తుంది.

అలా చేస్తే క్రియేటివిటీ రాదు
మిమ్మల్ని నవ్వించే వాళ్లందరిని ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందా? మీరిలా చేస్తే వాళ్లు భయపడిపోతారు. అది చేస్తే ఏం ప్రాబ్లమో, ఇది చేస్తే ఏం ప్రాబ్లమో..అనే ఆలోచనలో పడిపోతారు. క్రియేటివిటీ రాదు. మిగతా షో ల విషయంలో ఎలా ఉన్నా.. ఈ షో ని మాత్రం వదిలేయండి. దీని ఉద్దేశ్యం వేరు. దీనికి ఎటువంటి లాజిక్స్ లేవు. ఎంతో ఆలసిపోయి వస్తారు. చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకోండి. మేము ఎవరినీ టార్గెట్ చేసి అనడం లేదు కదా. చర్చించుకోవడానికి మన రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. రోడ్లు, కరెంట్, విద్య, బాలికలపై అత్యాచారం.. ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి. మీకు వినోదాన్ని ఇచ్చే ఈ అంశమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు.

అభిమాని కామెంట్‌ : నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా..?
తనని రెండో పెళ్లి చేసుకుంటావా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... ఎన్ని జన్మలెత్తినా మా ఆయన్నే పెళ్లి చేసుకుంటానంటూ బదులిచ్చారు.

అభిమాని కామెంట్‌ : సచ్చిందిరా గొర్రెలో రోల్‌  ఏంటీ ?
సినిమాలో నేనొక్క దాన్నే అమ్మాయిని. శ్రీనివాస్ రెడ్డి, వేణు,‌ రాకేష్‌, ఆనంద్‌తో ఒక్కదాన్ని మాత్రమే మెయిన్‌ రోల్‌లో నటిస్తున్నాని చెప్పారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top