అందుకే భార్య షూ లేసులు కట్టాడేమో?!

Anand Ahuja Bends To Tie Wife Sonam Kapoor Shoelaces - Sakshi

బాలీవుడ్ ఫ్యాషన్‌ దివా సోనమ్‌ కపూర్‌ అహుజా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ప్రియుడు ఆనంద్‌ అహుజాను పెళ్లాడిన ఆమె తల్లికాబోతున్నారంటూ బీ- టౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. గురువారం జరిగిన ఓ ప్రముఖ షూ కంపెనీ కొత్త బ్రాండ్‌ లాంచింగ్‌ కార్యక్రమానికి సోనమ్‌ భర్తతో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగా భార్యాభర్తలిద్దరు ఒకే రంగు షూ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే షూ వేసుకునే క్రమంలో సోనమ్‌కు ఇబ్బంది కాకూడదని భావించిన ఆనంద్‌.. ఆమె షూ లేసులు కట్టిన దృశ్యం అక్కడున్న వారితో పాటు ఫొటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఇంకేముంది.. వెంటనే తమ కెమెరా కన్నుకు పనిచెప్పి చకచకా క్లిక్‌మనిపించారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భార్యపై ఆనంద్‌కు ఎంత ప్రేమో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘భర్తతో షూలేసులు కట్టించుకోవడమేంటి సోనమ్‌.. నీకిది తగునా’ అని ట్రోల్‌ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ‘సోనమ్‌ తల్లికాబోతోంది. ఆమె బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనకు కష్టం కాకూడదనే ఆనంద్‌ షూ లేసులు కడుతున్నాడు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు. కాగా బాలీవుడ్‌ స్టార్‌ భామ దీపికా పదుకునే గురించి కూడా ఇలాంటి రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన దీపికా.. ‘పెళ్లైన వెంటనే తల్లి కావాలా..? అంటూ ప్రశ్నించింది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. పెళ్లైన వాళ్లను పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకు’ అంటూ దీపిక ఫైర్‌ అయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top