అత్తగారింటిలో సందడి చేస్తున్న బన్నీ

Allu Arjun Dussehra Festival Celebrated In Mother In Law Village - Sakshi

సాక్షి, నల్గొండ: షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌కి బ్రేక్‌ తీసుకుంటున్నారు‌. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. ఇక ఈ విరామ సమయంలోనే వచ్చిన దసరా పండుగను స్పెషల్‌గా అత్తగారింటిలో జరుపుకుంటున్నాడు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం చింతపల్లి గ్రామమానికి అల్లు అర్జున్‌ దంపతులు విచ్చేసి సందడి చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బన్నీ రాకతో చింతపల్లి గ్రామ ప్రజలు దసరా పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇక తనను కలిసి విషెస్‌ చెప్పిన వారందరికీ కృతజ్ఞతల తెలిపారు. కాసేపు చిన్నారులతో కలిసి బన్నీ సందడి చేశారు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది. (బన్నీతో హ్యాట్రిక్‌ సినిమా..!)

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో షాక్‌ తిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో బన్నీ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలను అంధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడట. (గణపతి బప్పా మోరియా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top