ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం

ఇలాంటి నిర్మాతలు  ఇండస్ట్రీకి అవసరం


 –‘అల్లరి’ నరేశ్‌మేడమీద అబ్బాయి’ విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. నరేశ్, నిఖిలా విమల్‌ జంటగా జి. ప్రజిత్‌ దర్శకత్వంలో నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ‘మేడ మీద అబ్బాయి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘స్పూఫ్‌లు లేకుండా కథను, అందులోని పాత్రలు, సన్నివేశాలు, కామెడీని బేస్‌ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది.సైబర్‌ క్రైమ్‌ ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతు న్నాయో చూపించి చిన్న మెసేజ్‌ ఇచ్చాం. చంద్రశేఖర్‌గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్‌  చేశారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. అప్పుడే మరిన్ని సక్సెస్‌లు సాధించొచ్చు’’ అన్నారు. ‘‘ఇది డిఫరెంట్‌ మూవీ అని రిలీజ్‌కు ముందే చెప్పాను. అందుకే స్లో పాయిజన్‌లా సినిమా పెద్ద సక్సెస్‌ సాధించింది. కొత్త కాన్సెప్ట్‌ మూవీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని మరో సారి రుజువైంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్‌. ‘‘మూవీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌’’ అన్నారు చంద్రశేఖర్‌.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top