సస్పెన్స్‌.. రొమాన్స్‌ | alaknanda movie press meet | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌.. రొమాన్స్‌

Dec 21 2017 5:29 AM | Updated on Dec 21 2017 5:29 AM

alaknanda movie press meet - Sakshi

రవి వర్మ, భవికా దేశాయ్‌ జంటగా కార్తికేయ మిరియాల దర్శకత్వంలో వీబీ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వర్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘అలకనంద’. ఒక పాట, సింగిల్‌ ఫైట్‌ మినహా ఈ సినిమా టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయ్యిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. కార్తికేయ మాట్లాడుతూ–‘‘సస్పెన్స్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. యూత్‌ కనెక్ట్‌ అవుతారన్న నమ్మకం ఉంది. కథ చెప్పిన వెంటనే మూడు భాషల్లో నిర్మించడానికి ముందుకొచ్చిన ఈశ్వర్‌ రావుకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘సస్పెన్స్‌తో కూడిన రొమాంటిక్‌ చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చాను. ఆల్రెడీ రష్‌ చూసుకున్నాం. కార్తికేయ బాగా తెరకెక్కించారు. హిట్‌ సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: శివ కాకాని, కెమెరా: కల్యాణ్‌ సమి.

Advertisement
 
Advertisement
Advertisement