రాములో రాములా...

ala vaikunta puramulo movie updates - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల...వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేతా పేతురాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌ పాత్రలో నటిస్తున్న సుశాంత్‌ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘రాజ్‌ పాత్ర పోషిస్తున్నాను. ‘అల...వైకుంఠపురములో...’ నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు సుశాంత్‌. ఈ సినిమాలోని ‘రాములో.. రాములా...’ పాట టీజర్‌ ఈ రోజు సాయంత్రం విడుదలవుతోంది. పూర్తి పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నాను. ఈ పాట చాలా క్యాచీగా ఉంటుందంటున్నారు అల్లు అర్జున్‌. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలో ‘సామజవరగమన...’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. టబు, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top