అల... ఓ సర్‌ప్రైజ్‌

Ala vaikunta puram lo teaser released on sep 7 - Sakshi

వెండితెర వైకుంఠపురములోని తన బంధువులందర్నీ దగ్గర చేసే పనిలో ఉన్నారట అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘అల.. వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఓ ఫారిన్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారని తెలిసింది.

విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట టీమ్‌. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ విడుదలైంది. నవంబరు 7న త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారట. ఆ రోజు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని ఊహించవచ్చు. జయరాం, టబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top