బిగ్‌ బి పాత్రలో అజిత్‌ | Ajith To Play Amitabh Role In Pink Tamil Remake | Sakshi
Sakshi News home page

Aug 18 2018 9:50 AM | Updated on Aug 18 2018 9:52 AM

Ajith To Play Amitabh Role In Pink Tamil Remake - Sakshi

తమిళసినిమా: ఒక సంచలన వార్త తాజాగా సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ పాత్రలో కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ నటించబోతున్నారన్నదే ఆ వార్త. అజిత్‌ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలింస్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. వీరం, వేదాళం, వివేగం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అజిత్, శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇది. విశ్వాసం చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

అజిత్‌ తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నది తాజా వార్త. బాలీవుడ్‌లో సంచలన విజయాలతో పాటు అవార్డులను సాధించిన పింక్‌ చిత్రాన్ని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ తమిళంలోకి రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలో అజిత్‌ నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. పింక్‌ చిత్రం గురించి చాలా మందికి తెలుసు. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం పింక్‌.

బిగ్‌బీ పోషించిన న్యాయవాది పాత్రను తమిళంలో అజిత్‌ నటించనున్నారు. ఈ చిత్రం నటి తాప్సీకి బాలీవుడ్‌లో లైఫ్‌ ఇచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రాల ఫేమ్‌ వినోద్‌.. పింక్‌ రీమేక్‌ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మొదట రీమేక్‌ చిత్రానికి దర్శకత్వం వహించడానికి వినోద్‌ ఆసక్తి చూపకపోయినా, నటుడు అజిత్, నిర్మాత బోనీకపూర్‌ చెప్పడంతో తాను అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం ఆయన పింక్‌ రీమేక్‌కు స్క్రీన్‌ప్లే సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో నటి తాప్సీ పాత్రలో నటించే లక్కీచాన్స్‌ ఏ హీరోయిన్‌కు దక్కుతుందో చూడాలి. అదే విధంగా ఈ సంచలన చిత్రానికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన వెలువడవలసి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement